Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హోటల్‌లో బిల్లు కట్టకుండా చెక్కేసిన కన్నడ నటి!

  • బెంగుళూరులోని ఓ హోటల్‌లో దిగిన పూజా
  • పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు
  • సమన్లు జారీ చేసిన పోలీసులు
బెంగుళూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో కొన్ని రోజుల పాటు బస చేసి, బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయ్యిందని తెలుసుకోగానే ఓ సినీ నటి అక్కడి నుంచి చెప్పాపెట్టకుండా చెక్కేసిందట. దీంతో హోటల్ యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే, ప్రముఖ కన్నడ నటి పూజా గాంధీ బెంగుళూరులోని ఓ లగ్జరీ హోట‌ల్‌లో దిగింది. ఆమె కొన్ని రోజుల పాటు ఆ హోటల్‌లో బస చేయడంతో బిల్లు దాదాపు రూ.4.5 లక్షలు అయింది. విషయం తెలుసుకున్న పూజా హోటల్ నుంచి మెల్లిగా జారుకుంది. దీంతో హోటల్ యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పూజాకు పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే తాను రూ.2 లక్షలు చెల్లించానని, మిగిలినవి కాస్త గడువిస్తే చెల్లిస్తానని హోటల్ యాజమాన్యాన్ని కోరినట్టు తెలుస్తోంది. దీంతో హోటల్ యాజమాన్యం కూడా ఆమెకు గడువిచ్చినట్టు తెలుస్తోంది.
Puja Gandhi
Bengulore
Hottel
Police Station
Bill

More Telugu News